top of page
harmony top new design.jpg

||హార్మొనీ తెలుగు||

వ్యక్తిగత  స్థిరత్వం మరియు అత్యుత్తమమైన కార్య నిర్వహణ

కోసం 
 

6 వారాల ఆన్ లైన్ శాస్త్రీయ ధ్యాన కార్యక్రమం

జనవరి 9th నుండి ఫిబ్రవరి 17th, 2023 వరకు

7pm to 8:15pm IST (INDIA) 

8:30am to 9:45am US ET (USA)

మీరు అనంతమైన సంభావ్యత. దాన్ని అన్వేషించండి!

 

దీనికి ఉచితంగా హాజరుకoడి

" హార్మొనీ తెలుగు", 6 - వారాలు ఆన్‌లైన్ మెడిటేషన్ ప్రోగ్రామ్

కార్పొరేట్, సంస్థాగత & వ్యాపార నాయకులు మరియు నిపుణులు

కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఎవరైనా ఒక బుద్ధ – CEO కావచ్చు

 

ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరినీ బుద్ధ-CEO నాయకుడిగా మార్చడంలో సహాయపడటమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ధ్యానం యొక్క శాస్త్రం, జ్ఞానం మరియు అభ్యాసాన్ని కనుగొనండి; ‘బుద్ధ – CEO’గా ఎదగండి – మరింత దయగల, స్నేహపూర్వకమైన, శక్తివంతమైన,  అంతర్దృష్టితో చూడగలిగే సృజనాత్మకమైన మరియు లక్ష్యంతో నడిచే నాయకుడిగా ఎదగండి. 

శక్తివంతమైన ధ్యాన జ్ఞానంతో కూడిన ఈ 6 వారాల ధ్యాన సాధన, ఉపచేతనా మనసు యొక్క పాత ధోరణులను పునర్నిర్మించి, సాధికార, సంతోషకరమైన జీవితానికి ఒక సానుకూల, అద్భుతమైన మనస్తత్వాన్ని నింపుతుంది/ అందిస్తుంది.

 

ఒక వ్యక్తికి, వారి అంతులేని సామర్థ్యాన్ని గుర్తిస్తూ తన చైతన్యాన్ని గణనీయంగా విస్తరించుకునేందుకు మరియు అంగీకారం, సానుభూతి, ధైర్యం, విశ్వాసం, స్పష్టత మరియు సృజనాత్మకత కలిగి ఉన్న జీవితం గడిపేందుకు అవకాశాలను కల్పిస్తుంది. 

మీరు ఎలా ప్రయోజనం పొందుతారు

Benefits.png

6 వారాల కోర్సు 

6WeeksMetamodel.jpg

కోర్సు విధానం మరియు వివరాలు

  • రోజూ జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు

  • రోజూ 45 నిమిషాలు ప్రత్యేక సంగీతంతో Breath Mindfulness (శ్వాస జాగరూకత) సామూహిక ధ్యానం

  • అనుభవజ్ఞులైన కార్పొరేట్ ధ్యాన గురువులచే తెలుగులో సందేహాలు తీర్చటం మరియు మార్గదర్శకత్వం వహించడం .

  • వారానికి 2 లేదా 3 –   40 నిమిషాలు కార్పొరేట్ ధ్యాన జ్ఞానం గురించిన మాస్టర్ క్లాసులు

  • ప్రతి వారం వ్యాపార నాయకత్వం సెషన్స్

  • ప్రతి వారం సామూహిక ధ్యానం

  • ప్రతి వారం బ్రేక్ – ఔట్ రూం సెషన్స్

  • మీ ధ్యాన సాధనలో తోడ్పడేందుకు రోజూ వ్యాసాలు / వనరులు

  • సంగీత ధ్యానం యొక్క ఆడియో రికార్డింగ్స్

chandra sir image.png

చంద్ర పులమరశెట్టి
వ్యవస్థాపకులు, బుద్ధ-CEO క్వాంటమ్ ఫౌండేష
న్ 

  సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వ్యవస్థాపకులు, IBM కార్పొరేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్

బుద్ధ-CEO క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్ర పులమరశెట్టి ఒక విజయవంతమైన సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వ్యవస్థాపకులు, IBM కార్పొరేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్, ట్రాన్స్‌ఫర్మేషనల్ మెడిటేషన్ కోచ్ మరియు బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్‌తో సహా కొన్ని లాభాపేక్ష లేని సంస్థల బోర్డు సభ్యులు/సలహాదారు.

చంద్ర పులమరశెట్టి తన సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘సనోవి టెక్నాలజీస్‌’ ను IBM ఇటీవల కొనుగోలు చేయడంతో పాటు తన విజయానికి కూడా ధ్యానం మరియు మానిఫెస్టేషన్ పై  ఆధారపడిన శక్తివంతమైన సూత్రాలు/పద్ధతులు కారణమని చెప్తారు.

1999 వ సంవత్సరంలో తన సోదరుడు డాక్టర్ GK ద్వారా ధ్యానం నేర్చుకున్న చంద్ర గారు, బ్రహ్మర్షి పత్రీజీ బోధనల ద్వారా ప్రేరణ పొందారు మరియు లోతుగా రూపాంతరం చెందారు. అతను డాక్టర్ జో డిస్పెంజా, స్వామిరామ, నీల్ డోనాల్డ్ వాల్ష్, సేత్ మరియు తూర్పు - పశ్చిమ ప్రాంతాల నుండి అనేక మంది మాస్టర్స్‌ గురించి అభ్యసించారు. అతను ఇప్పుడు 20 సంవత్సరాలుగా ధ్యానాన్ని అభ్యసిస్తున్నారు. సంస్థాగత, వ్యాపార నాయకులు మరియు నిపుణులకు క్రమం తప్పకుండా బోధిస్తారు. బహుళ - రోజుల అధునాతన శాస్త్రీయ ధ్యాన శిక్షణా తరగతులను (Meditation retreats) నిర్వహిస్తున్నారు మరియు అనేక ధ్యాన సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.

 

ప్రతి నాయకుడూ ఒక బుద్ధ-CEO గా రూపాంతరం చెంది సమాజానికి గణనీయంగా సాయపడేందుకు ఒక ఆధ్యాత్మిక ప్రపంచం అతి తక్కువ సమయంలో స్థాపించబడాలి అనేది చంద్ర గారి కల.

40dayaug
Harmony40day
హార్మొనీ - రిజిస్ట్రేషన్ కొరకు

గమనిక : సమర్పించు బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా, మీరు ఈ కార్యక్రమానికి సంబంధించిన  నిర్ధారణ ఇ-మెయిల్‌లు, మెసేజ్ లు, రిమైండర్లు మరియు రోజువారీ సందేశ వార్తాలేఖలు వంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని సమాచారాలను స్వీకరించడానికి అంగీకరిస్తున్నారు.

bottom of page