top of page
juyt_1.jpg

ప్రాజెక్ట్ ఎక్స‌లెన్స్

" సర్టిఫైడ్ మెడిటేషన్ టీచర్ కొరకు "

ఈ ప్ర‌పంచాన్ని 'ధ్యాన జగత్' గా మార్చాల‌న్న బ్ర‌హ్మ‌ర్షి పితామహ ప‌త్రీజీ ఆశ‌య సాధ‌న‌లో భాగంగా వివిధ రంగాల‌లో ప‌ని చేస్తున్నవారంద‌రికీ ధ్యాన పరిచ‌యం చేసి, దాని ద్వారా వారిని అత్యుత్త‌మమైన కార్యోన్ముఖులుగా తీర్చ‌దిద్దడానికి "ప్రాజెక్ట్ ఎక్స‌లెన్స్"  పేరుతో ఓ మ‌హోన్న‌త‌మైన కార్య‌క్ర‌మాన్ని మీ ముందుకు తీసుకురావ‌డాన్ని బుద్ధ-సీఈఓ (Buddha-CEO) ఓ మ‌హాద్భాగ్యంగా భావిస్తుంది. 
 
ప్ర‌తి ఒక్కరినీ వ్య‌క్తిత్వ‌ప‌రంగా మాత్రమే కాకుండా సామాజికంగా, మానసికంగా మరియు ఆర్ధికంగా ఉన్న‌తుల‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యంగా రూపొందించిన కార్య‌క్ర‌మ‌మిది.

  "బుద్ధ CEO క్వాంట‌మ్ ఫౌండేష‌న్" ఆధ్వర్యంలో "PSSM" మాస్ట‌ర్ల స‌హాయ స‌హ‌కారాల‌తో రూపుదిద్దుకున్న ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, కార్పోరేట్ సంస్థ‌ల ఉద్యోగులకు ధ్యానం గురించి అవ‌గాహ‌న క‌ల్పించడంతో పాటు ధ్యాన సాధ‌నకు అవ‌స‌ర‌మైన ఆత్మ స్థైర్యాన్నిచ్చి, ఎవరి రంగాల‌లో వారు అత్యద్భుతంగా ఎద‌గ‌డానికి ఈ కార్య‌క్రమం ఎంత‌గానో తోడ్ప‌డుతుంది.
 
ఈ క్ర‌మంలో ఆయా సంస్థలతో, అధిపతుల స‌హాయ స‌హ‌కారాల‌తో ధ్యాన విజ్ఞానాన్ని అంద‌రికీ అత్యంత సులువుగా పంచ‌డానికి మార్గం సుగ‌మం చేయ‌డ‌మే ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ ప్ర‌ధాన ఉద్దేశ్యం.

 

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మ‌హోన్న‌తమైన ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌డానికి, త‌మ బాధ్య‌తాయుత‌మైన సేవ‌లందించడానికి,  ధ్యాన ప్ర‌చారం కోసం పాటు ప‌డే నిస్వార్ధ‌మైన, అంకిత‌మైన  ధ్యాన శిక్ష‌కులు/కోచ్ లకు సాద‌రంగా ఆహ్వానం ప‌లుకుతున్నాం!
 
మీరు "మెడిటేషన్ టీచర్ / కోచ్" కాదలుచుకుంటే.... ఈ అద్భుత అవ‌కాశం మీకోస‌మే..!

మ‌రి ఎందుకు ఆల‌స్యం...క్రిందన ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుగు భాషలో ధ్యాన శిక్ష‌కులుగా మీ పేరుని నమోదు చేసుకోండి.

 ఈ అపూర్వ అవ‌కాశాన్ని వినియోగించుకోండి. నిస్వార్ధంగా, అంకితభావంతో ప‌త్రీజీ ఆశ‌యాల సాధ‌న‌కు స‌హ‌క‌రించండి....ఈ ప్రోగ్రామ్ ద్వారా కోచ్/ట్రైనర్‌గా చేరి ఇప్పటి వరకూ ప్రతీ మాస్టర్ కలలు కన్న ఒక దయగల, శాంతియుతమైన మరియు ఆనందకరమైన ధ్యాన ప్రపంచాన్ని నిర్మించడంలో భాగం అవ్వండి. ఈ ప్రపంచానికి మీ వంతు ధ్యానులను అందించి భూమికి అత్యంత విలువైన దానం చెయ్యండి!

 

మరింత సమాచారం కొరకు సంప్ర‌దించవలసిన ఫోన్ నెంబ‌ర్: +91 99028 56285

bottom of page